కాంగ్రెస్ గూటికి ఫైలేట్ . మహేందర్ రెడ్డిని ఢీ కొట్టేందుకు రంగం సిద్దం

తాండూరు : యంగ్ లీడర్స్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నుంచి బయటకు పంప బడ్డ నేత పైలేట్ రోహిత్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తాండూరు పేరు చెప్పగానే ముందుగా గుర్తు వచ్చేది  మంత్రి మహేందర్ రెడ్డి అయితే ఆయనను అనుక్షణం ఢీ కొట్టాలని చూసే మరో నాయకుడు అతడే పైలేట్ రోహిత్ రెడ్డి.   ఉద్యమ నాయకుడిగా ఉండి 2014 సంవత్సరంలో తాండూరు నుంచి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని  ఆలోచించిన నేత. కాని అనూహ్యంగా మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి రావడం, తాండూరు టిక్కెట్ దక్కించుకోని , మంత్రి పదవులు అనుభవించడం చక చక జరిగిపోయాయి. ఇదిలా ఉంటే తాండూరులో మంత్రికి మేకులా తయారైన రోహిత్ ను దెబ్బతిసేందుకు మంత్రి అతన్ని పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారని బయటకు పంపినట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పలుమార్లు పైలేట్ రోహిత్ రెడ్డి సైతం మీడియా ముందు తన బాధను వెళ్లగక్కాడు. అడుగడుగునా అడ్డు పడుతున్న మహేందర్ రెడ్డిని తట్టుకోవాలని కాంగ్రెస్ గూటికి చేరుకుని ఎమ్మెల్యేగా నిలబడేందుకు సిద్దమయ్యాడు. ఏది  ఏమైనా మహేందర్ రెడ్డి ఓడగొట్టాలని ధృడ నిశ్చయంతో ఉన్న పైలేట్ ఆశలు ఎంత వరకు నెరవేరుతాయో మరో మూడు నెలల్లో తెలిపోతుందని తాండూరు ప్రజలు పేర్కొంటున్నారు.

  • 74
    Shares

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here