వికారాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా వీరిలో ఎవరైనా పనికొస్తారా…?

వికారాబాద్ : వికారాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎవరికి వారు నాకు ఎమ్మెల్యే అంటే నాకు ఎమ్మెల్యే టిక్కెట్ అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కాని అందులో ఎవరికి నేను ఎమ్మెల్యే అయ్యేంత అర్హత ఉంది అని మాత్రం ప్రశ్నించుకోలేక పోతున్నారు. కనీసం వెంట పట్టు మని పది మంది కూడా లేకున్నా నాకు టిక్కెట్ కావాలంటే నాకు కావాలని ఆశ పడుతూ ఫైరవీలు చేసుకుంటున్నారు. వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు ఆరోగ్యం సరిగ్గా లేదని అధిష్టానం వికారాబాద్ అసెంబ్లీ స్థానం అభ్యర్థిని ప్రకటించక పోవడంతో చోట మోటా లీడర్లందరూ ఎవరికి వారు నాకు టిక్కెట్ అంటే నాకు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  ఆ పై స్థాయి నాయకుల వద్దకు ప్రదక్షణలు చేస్తున్నారు. కాని నియోజకవర్గ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఈ గతి ఏమిటి ఎవరూ నిలబడుతారు. ఎవరికి  ఓటు వేయాలని ఆలోచిస్తున్నారు. కనీస ఎమ్మెల్యేలుగా పేరు చెప్పుకునే వారికి మనతో  ఓటు వేయించుకునే అర్హత ఉందని సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నాయి. కొందరూ ఆయా పత్రికల్లో నేను ఎమ్మెల్యే అంటే నేను రేజులో ఉన్నట్లు కథనాలు రాయించుకుంటున్నారు.  ఇంకో విషయం  ఏమిటంటే ఎమ్మెల్యే అభ్యర్థులుగా చెప్పుకునే వారి కంటే తాజా మాజీ ఎమ్మెల్యేకు మళ్లీ అవకాశం  ఇస్తే సరిపోతుందని మరి కొందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం వికారాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థులుగా డాక్టర్లు రాంచందరరావు, సబితాఆనంద్, విద్యాసాగర్, టి. ఆనంద్ లు రేసులో ఉండగా, ఉద్యమ నాయకుడు బి. కృష్ణయ్య, యువ శాస్ర్తవేత వండ్ల నందుతో పాటు ఉపాధ్యాయుడు దేవదాసు, డీపీవో పనిచేసే ఓ ఉద్యోగి యశ్వంత్ రావులు ఎవరికి వారు నాకు  టిక్కెట్ అంటే నాకు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కాని ఇందులోఎవరికి ఆ స్థానం ఉంది. వారికి టిక్కెట్  ఇవ్వోచ్చా అని ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. మరో సారి వికారాబాద్ అభివృద్ది మరో 10 సంవత్సరాలు వెనక్కు పోయే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని వికారాబాద్ పౌరుడిగా నేను కోరుతున్నా…

  • 65
    Shares

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here