జిల్లా రాజకీయాలో నోటా ఫివర్… ఎక్కువ శాతం యువత దానికే మొగ్గు

వికారాబాద్ : నోటు  ఒక మంచి నాయకుడిని గెలిపించుకునేందుకు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన బ్రహ్మస్ర్తం… అలాగే నాయకులను పతనం చేసేందుకు కూడా  అదే రాజ్యంగం  ఒక ఆయుదాన్ని ప్రసదించింది. అదే నోటా…. స్వర్థ రాజకీయాలకు, కుటుంబ పాలనకు, రౌడీ రాజకీయాలకు, భూ స్వాములైన రాజకీయ నాయకులను పతనం చేసేందుకు ఉపయోగించేందుకు పెట్టిందే నోటా. చాలా మంది ఒక ప్రాంతం నుంచి నాయకులు ఎన్నికల బరిలో ఉంటే వారు ఎవరూ సరైన వారు కాదని ఇంట్లోనే కూర్చోని ఓటును వృథా చేస్తున్నారు. దీని ద్వారా కొందరూ రాజకీయ నాయకులు దొంగ ోట్లకు పాల్పడిన అధికారం చేజిక్కించుకుని  ఐదు సంవత్సరాలు ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు. దీనికి తోడు అసమర్ధ నాయకులు చేతకాని వారు ప్రతి వాడు తెల్ల బట్టలు వేసుకుని ఉద్దారిస్తామని వచ్చి ప్రజల జేబులు కొల్లగొడుతున్నారు. అలాంటి  వారి పతనానికి నాందే ఈ నోటా.. చదువుకున్న యువత, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ  ఆలోచించాల్సిన తరుణం. నచ్చని నాయకుడిని ఎన్నుకోవడం కంటే నోటా మీద చెయ్యి పెట్టి ఎవడూ మాకు నచ్చలేదని చెప్పడం ఉత్తమం. నువ్వు ఓటు వేసిన నాయకుడు నిన్ను గుర్తు పడుతున్నాడా….? మందలో నువ్వు ఒకడిలా చూస్తున్నాడు…..? నీ కష్ట సుఖాలలో ఒక సరైనా పాలు పంచుకుంటున్నాడా….? వాడికి తెలిసిన నాయకుడి ఇంటికి పోతాడు. ఫోటోలు దిగుతాడు. పబ్లిసిటీ చేసుకుంటాడు. కాని నీ కష్టంలో భాగస్వామి అవుతాడా…? నా వాడు అని మనస్పూర్తిగా అనుకుంటాడా  ఆలోచించు. ఈ రోజు ఇచ్చే రూ. 500, బీర్ సీసా, బిర్యానికి నీ  ఓటును తాకట్టు పెట్టిన నీ లాంటి లక్షలాది మంది జీవితాలను నాశనం చేయకు. సరైనా నాయకుడు లేడు అనుకుంటే ఏ మి  ఆలోచించకుండా నువ్వు పోలింగ్ బూత్ కు వెళ్లు, అక్కడ నోటా అనే గుర్తు ఉంటుంది. దానిపైన ఒక్క నొక్కు నొక్కితే చాలు రాజకీయ నాయకులు జీవితాలను నువ్వే తారు మారు చేేసే సత్తా నీకు ఉంటుందని మర్చిపోకూ. జిల్లాలో ఈ సారి సరైన నాయకులు లేరని నా వ్యక్తి గత అభిప్రాయం  నువ్వు అది నిజమని నమ్మితే నోటాకు ప్రచారం చెయ్యి. తెలిసిన ప్రతి వాడికి ఈ సందేశం వెళ్లేలా తోడ్పాటు అందించు.  ఇది నా జిల్లా , నా ప్రజల అభివృద్ది కోసం నేను కోరుతున్నా చిన్న కోరికను నా తోటి యువత నా అడుగులో అడుగువై రా…..

  • 34
    Shares

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here