టీఆర్ఎస్ లో రచ్చ కెక్కిన రాజకీయం

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయం రచ్చకెక్కింది. మంత్రి జిల్లా అభివృద్దిని అడ్డుకోవడంతో పాటు తన అనుచరులకే పదవులు, నామినేట్ పోస్టులు వచ్చేలా చేస్తూ జిల్లాలో కుటుంబ పాలన చేస్తున్నారని రాష్ర్ట విద్యామౌళిక వసతుల కల్పన సంస్త చైర్మన్ నాగేందర్ గౌడ్ గత వారం రోజుల క్రితం విలేకరుల ముందుకు రాగా, శుక్రవారం టీఆర్ఎస్ వై రాష్ర్ట నాయకుడు , ఉద్యమ కారుడు శుభప్రద్ పటేల్ మహేందర్ రెడ్డి ఉద్యమకారులను పార్టీకి దూరం చేస్తూ పదువులు వారికి సంబంధించిన వ్యక్తులకు అంటగడుతున్నారని ఆరోపించారు.  ఉద్యమ నాయకులను కొట్టించిన మంత్రి ఈ రోజు మళ్లీ టీఆర్ఎస్ లోకి వచ్చి  జిల్లా అబివృద్దిని అడ్డుకుంటున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు ఏ  ఒక్క అభివృద్ది పని చేయక పోగా ముఖ్యమంత్రిని తీసుకురాలేక పోయారనిఘాటుగానే విమర్శంచారు. మంత్రి విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే తాండూరులో ఉద్యమ కారులంతా ఏకమై మంత్రిని ఓడిస్తామని సవాల్ విరిసారు. అంతే కాకుండా శనివారం చేవెళ్లలో సైతం ఉద్యమనాయకులు సమావేశమై విలేకరుల ముందు మంత్రిని విమర్శించారు. ఇదిలా ఉంటే శనివారం మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ వికారాబాద్ నాయకులు విలేకరుల సమావేశాలు పోటాపోటీనానిర్వహించారు.  ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆశిస్తున్నవడ్ల నందు, మంత్రిని విమర్శిస్తే ఊరుకోమని ఉద్యమం శుభప్రద్ ఒక్కడు చేస్తేనే తెలంగాణ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభప్రద్ పటేల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా అధిష్టానంకు లేఖ రాస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా జడ్పీటీసీ ముత్తహార్ షరీప్ పార్టీనాయకులు మంత్రి పై శుభప్రద్ చేసిన మాటలను ఖండించారు. శుభప్రద్ కు అధిష్టానం మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన ఓడిపోయిన నీకు మంత్రిని విమర్శించే స్థాయికాదని హెచ్చరించారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీలో రోజు రోజు అసమత్తి పెరిగిపోయి రాజకీయ పంచాయితీ రచ్చ కెక్కితు వస్తుంది.

  • 36
    Shares

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here