వికారాబాద్ అభివృద్దిలో వెనుకబడడానికి కారణం ఎవరూ…?

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా ప్రతి విషయంలో వెనుకబడడానికి కారణం  ఎవరూ ప్రజా ప్రతినిధులా…. లేక అధికారులా….. లేక ప్రజలా …… గత దశాబ్దాలుగా వికారాబాద్ కు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువు కావడానికి ప్రధాన కారణం…. స్వార్థ రాజకీయాల, లేక ప్రజలను మోసం చేసి సీటు పై కూర్చుంటున్న నాయకులా….లేక మనకేందుకులే అని జీతాలు తీసుకుంటూ పని చేస్తున్న అధికారులా…. ఏది ఏమైనా ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలోనే అంటరాని ప్రాంతంగా చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని నాకు అనిపిస్తుంది. మరి ఆ ముద్ర పోవడానికి పాలకులు మారాలా లేక ప్రజలు మారాలా. జీతాలు తీసుకుంటూ పని చేస్తున్న అధికారులు మారాలా మీరే చెప్పండి. నాకు ప్రతి నిత్యం జిల్లా అన్యాయం అవుతుందని బాధగా  ఉంటుంది. నేను పెడుతున్న పోస్టులు ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా మాత్రం పెట్టను నా దృష్టిలో అందరూ  ఒక్కటే నా ప్రాంతం బాగు పడాలి నా ప్రజలు సంతోషంగా  ఉండాలి. నేను ఎవరికి భయ పడను. నేను ఒక ప్రతినిధిలా ముందుకు వెళుతా అన్యాయం అనిపిస్తే ప్రశ్నిస్తా కనిపించకుండా పనిచేస్తా. ఎవరూ మారాలి అనే దానికి నువ్వు సమాధానం చెప్పు సరిపోతుంది. నా అడుగులో అడుగై రా సమాజాన్ని  మార్చక పోయిన పర్వలేదు మన ప్రాంతాన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా…

  • 40
    Shares

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here