ఆర్టీసీలో మరో రోడ్డు ప్రమాదం… తప్పిన పెనూ ముప్పు

వికారాబాద్ : ఆర్టీసీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక టైరు పగిలింది. దీంతో ొఒక్క సారిగా బస్సు రోడ్డు పక్కల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. గొండ గట్టు ఘటన మరువక ముందే మరుసటి రోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది. అది కూడా మరువక ముందే వికారాబాద్ నియోజకవర్గం ధారూరు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ఇంకా చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పెనూ ప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించిన మహేందర్ రెడ్డి వికారాబాద్ డిపోకు ఒక్కటి అంటే ఒక్క కొత్త బస్సు తెప్పించలేక పోయారని వికారాబాద్ డిపోలో ఉన్న ప్రతి బస్సు ప్రమాదస్థాయిలో ఉందని మరి కొందరూ పేర్కొంటున్నారు.

  • 20
    Shares

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here